మోదీ ఫుట్‌బాల్ ఆట.. ప్ర‌ధాని క్రీడా స్ఫూర్తి అద్భుతమంటూ ఫిఫా అధ్యక్షుడి ప్రశంసలు

  • సిక్కింలో చిన్నారులతో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ
  • మోదీ క్రీడా స్ఫూర్తిని కొనియాడిన ఫిఫా అధ్యక్షుడు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసిన జియాన్నీ ఇన్ఫాంటినో
  • ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని వ్యాఖ్య
ప్రధాని నరేంద్ర మోదీ క్రీడా స్ఫూర్తిపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినో ప్రశంసలు కురిపించారు. సిక్కిం పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చిన్నారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్న ఫొటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.

మంగళవారం గ్యాంగ్‌టక్‌లో పర్యటించిన ప్రధాని మోదీ, అక్కడి చిన్నారులతో సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. ఇది తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఆ యువ మిత్రులతో గడపడం ఆనందంగా ఉందని 'ఎక్స్' వేదికగా ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీనిపై స్పందించిన ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో, బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ ఫొటోను షేర్ చేస్తూ, "ప్రధాని మోదీ మన అందమైన ఆటను ఆడటం చూడటం చాలా బాగుంది. ఫుట్‌బాల్ నిజంగా ప్రపంచాన్ని ఏకం చేస్తుంది" అని క్యాప్షన్ జోడించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఫుట్‌బాల్‌కు విపరీతమైన ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. సిక్కిం, మణిపూర్, మిజోరం వంటి రాష్ట్రాల్లో క్రికెట్‌ను మించి ఫుట్‌బాల్‌ను ఇష్టపడతారు.

గతంలో కూడా పలు అంతర్జాతీయ వేదికలపై మోదీ, ఇన్ఫాంటినో కలుసుకున్నారు. 2018లో అర్జెంటీనాలో జరిగిన జీ-20 సదస్సులో ఇన్ఫాంటినో.. మోదీ పేరుతో ఉన్న ప్రత్యేక జెర్సీని ఆయనకు బహుమతిగా ఇచ్చారు. వీరిద్దరూ 2024 డిసెంబర్‌లో కువైట్‌లో మరోసారి సమావేశమయ్యారు.

PM Modi
FIFA President
Gianni Infantino
football session
Sikkim

More Telugu News